విడాకులు తీసుకున్న చెల్లెలి కాపురం సీరియల్ హీరోయిన్ శిరీష
on May 16, 2024
బుల్లితెర మీద కావొచ్చు, సిల్వర్ స్క్రీన్ మీద కావొచ్చు ఈ మధ్య కాలంలో విడాకుల వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఒక బుల్లితెర నటుడు పవన్ అలాగే రీసెంట్ గా ఒక ప్లే బ్యాక్ సింగర్ కూడా విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు బుల్లితెర నటి శిరీష తన భర్తతో విడిపోయినట్లుగా ప్రకటించింది. శిరీష అంటే ఎవరూ గుర్తు పట్టరు కానీ.. చెల్లెలి కాపురం సీరియల్ హీరోయిన్ భూమి అంటే ఎవరికైనా గుర్తొచ్చేస్తుంది. ఆ సీరియల్ ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది శిరీషా. 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికినట్లు ఒక షాకింగ్ న్యూస్ ని చెప్పింది. మొగలి రేకులు సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శిరీష.. ఆ తర్వాత వరుసగా సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా మారింది. "నా పర్సనల్ అప్ డేట్ ని ఫాన్స్ తో, మంచి కోరుకునే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాను.. నవీన్ - నేను, ఒకప్పుడు భార్యాభర్తలం.
కానీ ఇప్పుడు పరిస్థితులు మా చేతుల్లో లేవు అందుకే మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా దారులు వేరైపోయారు. ఈ సమయంలో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నా నిర్ణయాన్ని మీరంతా గౌరవించాలి. మీరంతా సహృదయంతో అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను. దయచేసి ఎవరూ విమర్శలు చేయొద్దు. నాకు నవీన్ పట్ల గౌరవం తప్ప మరేమీ లేదు. నేను సెలబ్రిటీగా ఉన్నాను కాబట్టి మీ అందరికీ ఈ విషయం గురించి చెప్పాలని అనిపించింది. " అంటూ శిరీష తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. సిరిసిల్లకి చెందిన శిరీష తెలుగులో ఎన్నో సీరియల్స్‌లో నటించింది. స్వాతి చినుకులు, రాములమ్మ, మనసు మమత, నాతిచరామి, కాంచన గంగ, చెల్లెలి కాపురం, ఇలా ఎన్నో సీరియల్స్ లో హీరోయిన్గా నటించింది. శిరీషకు ఇద్దరు అక్కలు రజిత, సౌజన్య .. వీళ్ళు కూడా సీరియల్ యాక్టర్స్ కావడం విశేషం. కార్తీకదీపం సీరియల్లో డాక్టర్ చారుశీల పాత్రలో సౌజన్య నటించింది. ఈ దంపతులకు శ్రీఈష్ అనే బాబు కూడా ఉన్నాడు.
Also Read